![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.... జానూ తన తండ్రిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. తన తండ్రి తనకి కుటుంబం గురించి చెప్పిన బాధ్యతల గురించి గుర్తుచేసుకొని తనని తానే మోటివేట్ చేసుకుంటుంది. మరొకవైపు సూర్య ఇంటికి వెళ్తాడు. ఇంట్లో భువన ఉంటుంది. సూర్య రాగానే కోపంగా డోర్ వేస్తుంది. నేను వచ్చినా అని తెలిసినా కూడా ఇంత లేట్ గా ఇంటికి వచ్చావని అంటుంది. అమ్మ సారీ అని సూర్య అంటాడు. అయినా డోర్ తియ్యదు. దాంతో సూర్య దెబ్బ తగిలినట్లు యాక్టింగ్ చేస్తాడు. దాంతో భువన డోర్ తీసి ఏమైందని అడుగుతుంది. నువ్వు డోర్ తియ్యాలని అలా చేసానని సూర్య అంటాడు.
ఆ తర్వాత అమ్మ పాపం సింహాద్రి మావయ్య ఫ్రెండ్ శంకర్ చనిపోయాడని అనగానే అయ్యో పాపం అలా ఎలా జరిగిందని భువన బాధపడుతుంది. సరే భోజనం చేద్దాం అని సూర్య అనగానే పాపం వాళ్ళు అలా బాధలో ఉంటే మనం ఎలా భోజనం చేస్తామని భువన అంటుంది. ఆ తర్వాత జానూ ఉదయం లేవగానే నందు దగ్గరికి వెళ్లి.. అక్క వెళ్లి టిఫిన్ రెడీ చేద్దామని అంటుంది. నాకు చెయ్యాలని లేదని నందు అంటుంది. అయినా వినకుండా జానూ తనని కిచెన్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి టిఫిన్ రెడీ చేస్తారు. జానూ వాళ్ళు నానమ్మకి టిఫిన్ ఇచ్చి తినమని రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కిన్నెరకి గౌతమి తినిపిస్తుంది. శారద దగ్గరికి వెళ్లి తినిపిస్తుంది. అమ్మ నేను కిన్నెరా స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తాను.. అలాగే గౌతమి నువ్వు ఏ కాలేజీ అనుకుంటున్నావో చెప్పు అందులో జాయిన్ చేస్తానని జానూ చెప్తుంది.
నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా పైకి నవ్వుకుంటూ ఉంటున్నావని శారదా అంటుంది. ఆ తర్వాత కిన్నెరని తీసుకొని స్కూల్ కి వెళ్తుంది జానూ. అక్కడ ఒక పాప వాళ్ళ నాన్నతో ఉన్నది చూసి కిన్నెరా ఏడుస్తుంది. అప్పుడే జానూ వచ్చి కిన్నెరా ఎందుకు ఏడుస్తుందో చూసి తను కూడా బాధపడుతుంది. తరువాయిభాగంలో ఇక పెళ్లి జరగదని విషయం చెప్పి ఇంకా బాధపెట్టలేమని నందు కాబోయే అత్తగారు చెప్తారు. మేం పెళ్లి గ్రాంఢ్ గా చేస్తామని జానూ అంటుంది కానీ తోట ఏదో ప్రాబ్లమ్ లో ఉందట అని అబ్బాయి అనగానే జానూ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |